ఆరోగ్యం కోసం “ఆదిత్య” స్తోత్రాలు
రేపు అనగా ఆదివారం సప్తమి గడియలతో ఉన్నది. 2020 సంవత్సరంలో ముఖ్యంగా ఈ
కరోనా కాలంలో ఇలాగ ఆదివారం నాడు సప్తమి రావడం ఎంతో అదృష్టం (ఈ సంవత్సరం మొత్తంలో సప్తమితో కూడిన ఆదివారం
ఇది ఒకటే) కావున దీనిని అందరూ దృష్టిలో
ఉంచుకుని దానిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని కోరుతున్నాను.
ఆదివారం, సప్తమి ఇవి రెండు కూడా ఆదిత్యునికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అది కూడా
రెండు కలసి రావడం ఇంకా ఎంతో శుభం.
ఎంతో మంది నేటి శాస్త్రవేత్తలు, డాక్టర్స్ “ఆరోగ్యానికి, శభ్దానికి, వర్ణానికి (రంగు-colour) మరియు కాంతికి అవినాభావ సంబంధం ఉంది” అని తెలియచేసారు.
ఇదే విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రిత్రం మన భారతీయ శాస్త్రవేత్తలు అనగా
ఋషులు, యోగులు ఈ నాటి శాస్త్రవేత్తలకంటే భిన్నంగా ఇంకా ఎంతో విశదంగా అందచేసారు.
వాటిని నిగూడంగా శ్లోకాలు, పద్యాల రూపంలో అందించారు. అందుకే మన వేదాలను
చదవడానికి, ఒక లయ బద్ధతను పాటించి వాటికి అందమైన ఛందస్సులు, ప్రాసలు, అలంకారాలను
కూర్చి ఉంచారు. ఎందుకంటే శబ్ద ప్రకంపనలు మన ఆరోగ్యాలపై, మన పరిసరాలపై ఎంతో
ప్రభావాన్ని చూపుతాయి అని మనకంటే వారికే (మన ఋషులు, యోగులకే)
బాగా తెలుసు కాబట్టి, వాటిని పాటించి మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుదాం.
ఇకపోతే, ప్రస్తుతం
మనం ఆ శాస్త్రాలను గురించి తెలుసుకునేంత సమయం లేదు. కాబట్టి, వారి మీద నమ్మకంతో రేపటి ఆదివారాం రోజు సూర్యోదయాన నిద్ర లేచి స్నాన సంధ్యలు
పూర్తి చేసుకుని, తక్కువలో తక్కువగా ఉదయం 8 గంటలలోపుగా సూర్యుడికి ఎదురుగా
నిలబడేలా, ఆ సూర్యుడి నుండి వస్తున్న కిరణాలను మన శరీరంపై వీలైనంత ఎక్కువగా పడేలా
చూసుకుంటూ ఆయనకు ఇష్టమైన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇలా మీకు వీలైన స్తోత్రాన్ని,
శ్లోకాలను ఒకటి నుండి పదకొండు సార్లు చదవడానికి ప్రయత్నించండి, మీకు వీలు కాకపొతే హీనపక్షం ఆ శ్లోకాలను
వినదానికైనా ప్రయత్నించండి.
ఈ మద్య
కరోనా చికిత్సలో కూడా ఎండలో కాసేపు నిలబెడుతున్నారని మీరు వినే ఉంటారు. ప్లూ లాంటి
వ్యాధులకు ఇలా చేయడం మంచి ఔషదం కూడా.
కావున, ఇది
తప్పకుండా చేస్తారని ఆశిస్తూ.
దీని వలన మీ
ఆరోగ్యం పై మీరు చదివే శ్లోక శబ్దాలతో కూడిన సహస్రకిరణ సమేతుడు అయిన ఆదిత్యుడి
కిరణాలు మీ శరీరంపై సోకి మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ, మీ కోసం
వీలైనంత వరకు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇవ్వడం జరిగింది. వాడుకోగలరు.
మీకు
వస్తే, లేదా చేయగలిగితే సూర్య నమస్కారాన్ని కూడా చేయవచ్చు.
|| ఆదిత్య
హృదయం ||
|| ధ్యానం ||
నమస్సవిత్రే జగదేక చక్షుషే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగునాత్మ దారిణే
విరించి నారాయణ శంకరాత్మనే
తతో
యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||
దైవతైశ్చ
సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || 2
||
రామ
రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || 3
||
ఆదిత్యహృదయం
పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || 4
||
సర్వమంగళ
మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || 5
||
రశ్మిమంతం
సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6
||
సర్వదేవాత్మకో
హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7
||
ఏష
బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8
||
పితరో
వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || 9
||
ఆదిత్యః
సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || 10 ||
హరిదశ్వః
సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || 11 ||
హిరణ్యగర్భః
శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12
||
వ్యోమనాథస్తమోభేదీ
ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13
||
ఆతపీ
మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || 14
||
నక్షత్రగ్రహతారాణామధిపో
విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || 15
||
నమః
పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16
||
జయాయ
జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17
||
నమ
ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ
సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||
తమోఘ్నాయ
హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||
తప్తచామీకరాభాయ
వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||
నాశయత్యేష
వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||
ఏష
సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || 23 ||
వేదాశ్చ
క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24
||
|| ఫలశృతి
||
ఏనమాపత్సు
కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || 25 ||
పూజయస్వైనమేకాగ్రో
దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||
అస్మింక్షణే
మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || 27
||
ఏతచ్ఛ్రుత్వా
మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28
||
ఆదిత్యం
ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29
||
రావణం
ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || 30 ||
అథ
రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || 31 ||
|| ఇతి ఆదిత్య హృదయం
సంపూర్ణమ్ ||
|| సూర్యాష్టకం ||
|| సాంబ ఉవాచ ||
ఆదిదేవ
నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే || 1 ||
సప్తాశ్వరథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 2 ||
లోహితం
రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 3 ||
త్రైగుణ్యం
చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 4 ||
బృంహితం
తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
5 ||
బంధూకపుష్పసంకాశం
హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 6 ||
తం
సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 7 ||
తం
సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 8 ||
|| ఫలశ్రుతి : ||
సూర్యాష్టకం
యే పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9 ||
ఆమిషం
మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 ||
స్త్రీ
తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్ఛతి || 11 ||
|| ఇతి శ్రీ సూర్యాష్టకస్తోత్రం
సంపూర్ణమ్ ||
|| శ్రీ సూర్య ద్వాదశ నామ స్తోత్రం ||
ఓం సూం సూర్యాయ నమః
ఆదిత్యః ప్రథమం నామ ద్వితీయం తు దివాకరః |
తృతీయం
భాస్కరః ప్రోక్తం చతుర్థంతు ప్రభాకరః ||
పంచమంతు సహస్రాంశుః షష్ఠమం త్రైలోక్యలోచనః |
సప్తమం
హరిదశ్వశ్చ అష్టమం చ విభావసుః ||
నవమం దినకరం ప్రోక్తోః దశమం ద్వాదశాత్మకః |
ఏకాదశం
త్రయోమూర్తిః ద్వాదశం సూర్య ఏవ చ ||
|| ఇతి సూర్య ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం ||
రవి స్తోత్రం
జపాకుసుమసంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్
No comments:
Post a Comment