కరోనా కోసం, అమ్మవారి ఐదు
నామాలు
(LORD LALITA PARABATTARIKA
MANTRAS FOR CARONA & OTHER DISEASES)
మానవులు ఎంత గొప్ప శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నామని
విర్రవీగినప్పటికిని ప్రకృతిని జయించాలని అనుకున్నప్పటికిని తనను మించిన శక్తి ఒకటి ఉందని అది తన శక్తిని
ఇలా చూపిస్తుందని తెలుసుకొని. ఇలాంటి పరిస్తుతులకు కారణమైనవాటిని అర్థం
చేసుకోవాలని, అలా తెలుసుకోలేకపొతే అలా తెలియ తెలియ చేసినవారి అడుగు జాడల్లో నైనా
నడవడం నేర్చుకోవడం ఉత్తమం.
ప్రస్తుతం మనం ఉన్న ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో, ఈ విషయాన్ని
తెలుసుకొనేసరికి జీవితకాలం సరిపోతుంది. కాబట్టి, మన ఋషులు, యోగులు అందచేసిన కొంత కొంత
జ్ఞానాన్ని తెలుసుకుందాము. (ఇలా చెపితే వీరెవరా అనుకోకండి, వారు మనమనుకునే మనకాలపు
శాస్త్రవేత్తలు (Scientists, Technologists etc.))
ప్రస్తుతానికి, ఈ పరిస్థితికి అవసరమైన కొన్ని అమ్మవారి
నామాలను అందచేస్తున్నాము, వాటిని జపం (అనగా మననం) చేస్తూ గడపండి. ఈ కష్ట కాలం
నుండి బయట పడతాము.
ఈ క్రింది అమ్మ వారి ఐదు నామాలను జపించండి. అవే ఎందుకు
అని మీకు అనుమానం రాకుండా ఉండడానికి మీకు సరిపోయేంతగా వాటి అర్థాన్ని కూడా
వివరిస్తున్నాను. అర్థం తెలిసి జపిస్తే ఇంకా త్వరగా అమ్మవారి కృపకు పాత్రత
కలుగుతుంది. కనుక అర్థాన్ని మనసులో వుంచుకొని వీలైనన్ని సార్లు ఆ తల్లిని
తలుచుకొని, ఈ పరిస్థితుల నుండి బయట పడండి.
ఓం సర్వవ్యాధిప్రశమనీ, సర్వమృత్యునివారిణీ, అగ్రగణ్యా, చింత్యరూపా, కలికల్మషణాశిన్యై
నమః
1.
ఓమ్ సర్వవ్యాధిప్రశమన్యై నమః
2.
ఓమ్ సర్వమృత్యునివారిన్యై నమః
3.
ఓమ్ అగ్రగణ్యాయై నమః
4.
ఓమ్ చింత్యరూపాయై నమః
5.
ఓమ్ కలికల్మషణాశిన్యై నమః
ఇప్పుడు వీటి అర్థము చెప్పుకుందాం:
1.
సర్వవ్యాధిప్రశమనీ: అన్ని రకాల వ్యాధులను ప్రశమింప చేయునది
అనగా తగ్గించునది.
2.
సర్వమృత్యునివారిణీ: అన్ని రకాల మృత్యువులను
నివారించునది (చూసారా ఇలా చెప్పగానే, అదేంది మృత్యువు ఒక్కసారి వస్తే
రెండవసారి మనముండము కదా, అలాంటిది సర్వ మృత్యువులు అని
చెపుతారెంటి అని ప్రశ్న వస్తుంది. కానీ దాని అర్థము అపమృత్యువులనుండి అని అనగా
మృత్యువుతో సమానమైన వాటినుండి అని)
3.
అగ్రగణ్యా : అన్నిటికంటే గొప్పనైనది అని. అంటే తనకంటే గొప్ప
వారెవరు లేరని. కావున గొప్పదైన అమ్మవారికె కదా మన కష్టాలు చెప్పుకోవలసినది.
4.
చింత్యరూపా: చూసారా ఆమె చింత్యరూపా అనగా నువ్వు ఏ రూపంలో
కోరుకొంటే ఆ రూపంలో కనిపించేది, వినిపించుకునేది. ఆ ఊహ నీ పరిధిని నిర్ణయిస్తుంది.
5.
కలికల్మషణాశిణి : కలియుగంలో నీకు కలిగిన
కల్మషాలను తొలిగించునది.
కావున, ఆ తల్లిని పట్టుకుని ఈ కష్ట కాలాన్ని సుఖ సంతోషాలతో
దాటగలరు.
పైన చెప్పినవి చూడగానే, చింత్యరూపా అని ఇచ్చిన దానికి కొంత మంది లలితా
సహస్రం తెలిసినవారికి అది చింత్యరూపా కాదు
కదా అచింత్యరూపా కదా అలా ఇచ్చారేమి అని సందేహం వస్తుంది అలాంటి వారికోసం క్రింది వివరణ.
అవును, అది నిజమే అది అచింత్యరూపాయే, అదే నిజం.
ఆమెది మనచేత చింతించగలిగిన రూపం, మన చింతలకు అందగలిగిన రూపం
కానప్పటికీ.
"చింత్యరూపా" అనగా మనము చింతిచిన రూపము అనగా అది
మన మనసులలోని దేవుడే కావచ్చు, దేవతే కావచ్చుగాక (అమ్మవారు ఈ
ఆ రూపమనేగాక సర్వ దేవతా రూపిణి కావున). మనము మనసున తలచుకొని, చింతించి, ఆ తల్లి మనకు దగ్గరగానే ఉంది అని
తలంచి ఈ కష్ట కాలం నుండి బయట పడడానికి గాను దానిని సంధానించారు గురువుగారు.
తమ చింతలలో ఆ అమ్మకు ఒక రూపాన్ని నిలుపుకొని వారి వాంఛితాలను తీర్చుకున్న
మహానుభావులు ఇంతకు ముందు యుగాలలో ఎందరో ఉన్నారు (1. మేనదేవి, పర్వతరాజులు
చింతా మాత్రంగా 'పార్వతిదేవి'గా ఆ
అమ్మవారిని పొందడం, 2. చింతా మాత్రంగా (కలలో కనిపించినంత
మాత్రంగానే) చారుమతి 'వరలక్మి వ్రతం' చేసి,
తనవారితో చేయించి ధన్యురాలు (వరలక్ష్మి కృపకు పాత్రురాలు కావడం)
కావడం, ఇంకా ఎన్నో ఉదంతాలున్నాయి, అయినా
వీటితో సరిపోతుందనే ఉద్దేశంతో). అలాంటి వారి చింతలలో ఆమె ఎప్పుడు కూడా
వారి 'చిత్'లలో
చింత్యరూపగానే పూజించి తరించారు, అందుకే ఆ పరమార్థంతోనే "చింత్యరూపా"ను
అందించడం జరిగింది.
అంతే కాకుండా
ఈ కలికాలంలో కలి దరి చేరకుండా 1) ప్రతీ మానవుడిలోని 'చిత్'లలో ఎదో ఒక రూపంలో ఆ అమ్మను నిలపి ఉంచి (అది వారి వారి దేవుళ్ళ ప్రతిరూపమే
అగు గాక) తరింప చేయాలనే ఉద్దేశ్యంతోనూ,
2) ఆ అమ్మను ఇంకా అందరికీ అందని అచింత్యరూపగా కాకుండా, అందరికీ అందెలాగున "చింత్యరూపా" అనగా వారివారి దేవుళ్ళకు
వేరుకాదు అని వారికి తెలియచేయడానికే "చింత్యరూపా" అని అందించడం
జరిగింది.
అందుకే ఈ కష్ట కాలంలో అమ్మను "అచింత్యరూపా"గా కాకుండా నీ మనసులోని
"చింత్యరూపా"గానే కొలిచి తొందరగా తల్లి కృపకు
పాత్రుడివి అవుతావని ఆశిస్తూ.
మిత్రేశ్వరానందనాథ
No comments:
Post a Comment