శ్రావణ వర మహాలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతమును శ్రావణమాసం
రెండవ శుక్రవారం రోజున జరుపుకుంటారు (ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో
కూడా ఈవ్రతాన్ని ఆచరించవచ్చును).
భక్తితో వేడుకుంటే
వరాలందించే తల్లి వర మహాలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి పెద్దగా ఏలాంటి నియమాలు, నిష్ఠలు,
అవసరం లేదు. అమ్మవారిపై నిశ్చలమైన భక్తి ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం
ఎంతో శుభాప్రదమైనది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి
ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి.
స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే ఒక
ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలా అష్ట సంపదలు ఉన్నాయి.
వ్రత విధానం
తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించి ఇంటికి
ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి (ఈ రోజులలో అవుపేడతో అలికేంతగా ఉండదు కాబట్టి, శుభ్రంమైన
నీటిలో కాసింత పసుపు కర్పూరము కలిపి పూజా స్థలంలో గాని లేదంటే ఇల్లు అంతటిని శుభ్రం
చేసుకోవడం ఉత్తమం) ఇంట్లోని పూజా స్థలంలో అమ్మ వారి కొరకు ఒక మండపాన్ని
ఏర్పాటుచేసుకోని, ఆ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేయాలి. ఆ మండపంపై అమ్మవారి ఫొటో లేదా రూపు లేదా విగ్రహాన్ని
అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు,
పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం
తయారు చేసుకోను విధానం :
తెల్లటి దారాన్ని తొమ్మిది (ఐదు)
పోగులతో తీసుకుని దానికి పసుపు రాసి, దానికి తొమ్మిది (ఐదు) పూలు తీసుకుని
ఒక్కొక్క పూవుతో తొమ్మిది (ఐదు) ముడులుగా ముడి వేయాలి. అంటే తొమ్మిది (ఐదు) పోగుల
దారాన్ని ఉపయోగించి, తొమ్మిది (ఐదు) పువ్వులతో తొమ్మిది (ఐదు)
ముడులతో తోరంను తయారు చేసుకోవాలి.
శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన
సామగ్రి
అమ్మవారి విగ్రహం లేదా ఫోటో,
పసుపు,
కుంకుమ,
గంధం,
విడిపూలు,
పూల మాలలు,
తమలపాకులు
వక్కలు,
ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు,
తెల్లని వస్ర్తం,
రవికల గుడ్డ,
మామిడి ఆకులు,
ఐదు రకాల పండ్లు,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా
నోము దారం, లేదా
పసుపు రాసిన కంకణం,
ఇంటిలో తయారుచేసిన
నైవేధ్యాలు,
బియ్యం,
పంచామృతాలు
దీపపు కుందులు,
ఒత్తులు,
నెయ్యి
|| శ్రీ వరలక్ష్మీ వ్రత విధానము ||
ఆత్మశుద్ధి
ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థా గతో పి వా |
యః స్మరేత్ పుండరీకాక్షః స బాహ్యాభ్యంతరః సుచిః ||
పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షయ నమః
గణపతి నమస్కారం
ఓం శుక్లామ్భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయే త్సర్వ విఘ్నొపశాన్తయే.
దీప పూజ
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం
ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము
వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమబొట్లు పెట్టవలెను.)
ఆచమనం
ఓం కేశవాయ
స్వాహా,
ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాదవాయ స్వాహా,
(అని మూడుసార్లు
చేతిలో నీరు తీసుకోని త్రాగవలెను)
ఓం గోవిందాయ నమః,
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః,
ఓం త్రివిక్రమాయ నమః,
ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయ నమః,
ఓం పద్ననాభాయ నమః,
ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్మాయ నమః,
ఓం అనిరుద్ధాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః,
ఓం అథొక్లజాయ నమః,
ఓం నారసీంహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః,
ఓం శ్రీ కృష్ణాయ నమః
గంటా నాధం
ఓం ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు
రాక్షసాం
కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ (గంటను
మ్రోగించవలెను)
భూత శుద్ధి
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి
భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ
సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
||
ఓం మహా గణపతేభ్యో నమః
ఓం సర్వేభ్యో గురుభ్యో నమః .
ఓం సర్వేభ్యో దేవేభ్యో
నమః .
ఓం సర్వేభ్యో
బ్రాహ్మణేభ్యో నమః
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం
నమః
ఓం వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం మాతా పితరాభ్యోం నమః
ఓం నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ప్రాణాయామం
(కుడిచేతితో ముక్కు పట్టుకొని క్రింది మంత్రంను పఠిస్తూ మూడుసార్లు నాసిక (ముక్కు) తో గాలిని నెమ్మదిగా
లోపలికి పీల్చి వదలి వేయడం చెయ్యాలి)
ఓం ప్రణవస్య పరబ్రహ్మ
ఋషిః . పరమాత్మా దేవతా .
దైవీ గాయత్రీ ఛందః .
ప్రాణాయామే వినియోగః
ఓం భూః ఓం
భువః ఓగం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం
ఓం తత్ సవిర్వర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.
ఓం మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భుర్భువ స్సువరోమ్. (ప్రాణాయామం చేసి
అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
పునరాచమనం
ఓం ఆపోజ్యోతి రసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోం
సంకల్పం
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీవరలక్ష్మిదేవీ
ముద్దిశ్య శ్రీవరలక్ష్మిదేవీ ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీమహావిష్ణో
రాజ్ఞ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వ్తెవస్వత
మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్విపే భరతవర్షే భరతఖణ్డే మేరోర్దక్షిణదిగ్భాగే
శ్రీశ్తైలస్య.ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే.గృహే సమస్త దేవతా బ్రాహ్మణ
హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహరిక చాంద్రమానేన శార్వరి నామ సంవత్సరే.దక్షిణాయనే.వర్ష
ఋతౌ శ్రావణ మాసే.ద్వాదశి తిధౌ.బృగు (శుక్ర) వాసరే శుభ నక్షత్రే
శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ మీ గోత్రం
గోత్రస్య పేరు నామధేయస్య, ధర్మపత్నీ
సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభి
వృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం సత్సన్తాన
సౌభాగ్య శుభ ఫలావాప్యర్ధం శ్రీ వరలక్ష్మీ దేవీ ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానా వాహనాది
షోడసోపచార పూజాం కరిష్యే:
తదంగత్వేన కలశారాధానం కరిష్యే
కలశ పూజ
కలశస్య ముఖే
విష్ణు కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్థితాః
కుక్షౌతు
స్సాగర స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
గంగేచ యమునేచైవ
కృష్ణ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
కలశపాత్రపై కుడి అరచేయినుంచి పై మంత్రము
చదివి కలశపాత్రకు గంధము, కుంకుమబొట్లు
పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై,
పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
మహా గణపతి పూజ
ఓం గణానాం త్వా గణపతిగ్ హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః
అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ
మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే
నమః పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ
మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం
సమర్పయామి
శ్రీ
మహాగణాధిపతయే నమః ముఖే శుద్దాచమనీయం
సమర్పయామి, శుద్దోదకస్నానం సమర్పయామి
శ్రీ
మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం
సమర్పయామి
శ్రీ
మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం
సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్
సమర్పయామి
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్ది ప్రదాయకాయ
నమః
ఓం మహాగణాదిపతియే నమః
శ్రీ
మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర
పుష్పపూజాం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః
ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం
ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా,
ఓం అపానాయస్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా ,
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు
వదలాలి.)
తాంబూలం సమర్పయామి,
నీరాజనం దర్శయామి.
(తాంబూలము
నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాం
త్వా గణపతిగ్ హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః
అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ
మంత్రపుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ
శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని
నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు
గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.
(శ్రీ మహాగణపతి పూజ
సమాప్తం.)
శ్రీ వరలక్ష్మీ
వ్రత ప్రారంభం
ప్రాణ
ప్రతిష్ఠాపనం
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహినో
ధేహిభోగమ్| జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతేమృడయాన స్స్వస్తి || అమృతంవై ప్రాణా
అమృతమాపః
ప్రాణానేవ యధాస్ధానము పహ్వయతే|
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ
పుత్రా పౌత్ర పరివార సమేతం హే స్వామిన్ ||
స్సర్వజగన్నాథయావత్పూజావసానకమ్ తావత్ త్వ్తం ప్రీతిభావేన కలశేస్మిన్, చిత్రేస్మిన్, ప్రతిమాయాం
సన్నిధింకురు|
అవాహితోభవ, స్తాపితోభవ, సుప్రసన్నోభవ, స్థిరోభవ, వరదోభవ, అవకుంఠితోభవ సుముఖోభవ, స్ధిరాసనంకురు ప్రసీద,
ప్రసీద, ప్రసీద
(అని
మంత్రాన్ని చదివి మీరు ఏర్పరుచుకున్న కలశం/చిత్రం/రూపులలో అమ్మావారి ప్రాణప్రతిష్ఠ
చేసి వాటిపై అక్షతలు, పుష్పములు వుంచవలెను).
ధ్యానమ్
పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయనప్రియే దేవి సుప్రితాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కృతే
ఆవాహనము
హిరణ్యవర్ణాం
హరిణీం సువర్ణరజతఃస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
సర్వమంగళ మంగల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతాభవ సర్వదా
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం సభర్త్రు
పుత్ర పౌత్ర పరివార సమేతాం శ్రీ వరలక్ష్మీ దేవతామావాహయామి
స్థాపయామి పూజయామి
ఆసనం
తాం
ఆవహాజాతవేదో లక్ష్మీ, మనపగామినీమ్,
యస్యాం హిరణ్యంవిందేయం గామశ్వం పురుషానహమ్.
సూర్యాకోటి నిభాస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సింహాసనమిదం దేవీ స్వీకృతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి
పాద్యం
అశ్వపూర్వాం
రధమధ్యాం హస్తినాద ప్రబోధనీమ్
|
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్.
సువాసితజలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి
అర్ఝ్యం
ఓం కాంసో
స్మితాం హిరణ్యప్రాకారా మార్ద్రాం జ్వలన్తీం తృప్తాంతర్పయన్తీమ్ | పద్మేస్ధితాం
పద్మవర్ణాం త్వామిహోపహ్వయేశ్రితమ్.
శుద్ధోదకంచ పాత్రస్ధం గంధపుష్పాది మిశ్రితమ్,
అర్ఝ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
ఓం చన్ద్రాం
ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకేదేవ జుష్టాముదారామ్ | తాంపద్మినీ మీం శరణ మహం
ప్రపద్యే లక్ష్మీ ర్మే నశ్యతాన్త్వాం వృణే.
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం,
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
పంచామృత స్నానం
ఆదిత్యవర్ణే
తపసోధి జాతో వనస్పతి స్తన వృక్షో అధబిల్వః |
తస్య ఫలాని తపసానుదన్తు మాయాన్త రాయాశ్చ బాహ్యా అలక్షీః.
పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నాన మిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత
స్నానం సమర్పయామి
శుద్దోదక స్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితం
శుద్దోదకమిదం స్నానం గ్రుహాణవిధు సోదరీ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్దోదక
స్నానం సమర్పయామి
వస్త్రం యుగ్మం
ఓం ఉపైతుమాందేవ
సఖః కీర్తిశ్చ మణినాసహ |
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే.
సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసన ప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
ఉపవీతం
ఓం క్షుత్పిపాసామలాం
జ్యేష్ఠమలక్ష్మీర్నాశయా మ్యహమ్ |
అభూతి మసమృద్ధించ సర్వాంనిర్ణుదమే గృహాత్
తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవీ గృహాణత్వం శుభప్రదే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ గంధం
ఓం గంధద్వారాం
దురాధర్షాం నిత్యపుష్ఠాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియమ్.
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శ్రీ గంధం
సమర్పయామి
కుంకుమ
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
||
హరిద్రామ్
హరిద్రాచమయానీతం
దేవీ కళ్యాణ దాయిని |
సౌభాగ్య వర్థనీం నిత్యం గృహాణ హరివల్లభే ||
ఆభరణం
ఓం మనసఃకామ
మాకూతిం వాచ స్సత్య మశీమహి |
పశూనాగ్ం రూపమన్నస్సమయి శ్రీశ్శ్రయతాం యశః.
కేయూర కంకణా దివ్యహారనూపుర మేఖలాః
విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి.
పుష్పమాల
ఓం కర్దమేన
ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియంవాసయమేకులే మాతరం పద్మమాలినీమ్.
మల్లికా
జాజి కుసుమైశ్చంపకైర్వకుళై స్తధా
నీలోత్పలైఃశ్చలళారైః పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పై
పూజయామి
పరిమళ ద్రవ్యం
సుగంధ
శీతలం శుభ్రం నానాగంధ సమన్వితం |
ప్రీత్యర్థ తవదేవేశిత్వా మద్య ప్రతి గృహ్యాతామ్ ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పరిమళ
ద్రవ్యాని సమర్పయామి
అధాంగపూజ
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
ఓం చంచలాయై
నమః – పాదౌ
పూజయామి
ఓం చపలాయై
నమః – జానునీ పూజయామి
ఓం పీతాంబరాయై
నమః – ఉరుం
పూజయామి
ఓం కమలవాసిన్యై
నమః – కటిం
పూజయామి
ఓం పద్మాలయాయై
నమః – నాభిం
పూజయామి
ఓం మదన
మాత్రే నమః – స్తనౌ పూజయామి
ఓం లలితాయై
నమః – భుజ ద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై
నమః – కంఠం పూజయామి
ఓం సుముఖాయై
నమః – ముఖం
పూజయామి
ఓం శ్రియై
నమః – ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై
నమః – నాసికాం
పూజయామి
ఓం సునేత్రాయై
నమః – నేత్రౌ పూజయామి
ఓం రమాయై
నమః – కర్ణౌ పూజయామి
ఓం కమలాయై
నమః – శిరః పూజయామి
ఓం శ్రీవరలక్ష్య్మై
నమః – సర్వాణ్యంగాని పూజయామి
(అధాంగపూజ ఆయిన తరువాత పుష్పాలతో అమ్మవారికి క్రింది అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
ధూపం
ఓం ఆప్రస్స్రజన్తు
స్నిగ్ధాని చిక్లీత వసమేగృహే |
నిచ దేవీం మాతరం శ్రియం వాసయమేకులే.
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
దూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దూపమాఘ్రాపయామి
దీపం
ఓం ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం
సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
నైవేద్యము
ఓం ఆర్ధ్రాం
యః కరిణీం యష్టిం పింగాళాం పద్మ మాలినీం |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
నైవేద్యం షడ్రషోపేతం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
(నైవేద్యమునకు
వండిన పధార్ధములపై కలశోదకములను జల్లి)
ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయస్వాహా,
ఉదానాయస్వాహా, సమానాయస్వాహా - శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
(అని
కుడిచేతిలో పుష్పముంచుకొని నైవేద్య సమర్పణ చేయవలయును)
అమృతాపిధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి, హసౌప్రక్షాళయామి, పాదౌప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి
(అని
అయిదు పర్యాయములు పుష్పముతో ఉదకమునుంచవలయును.)
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవీ శీతలం సుమనోహరం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం
సమర్పయామి
తాంబూలం
ఓం తాంమ
ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విన్దేయం పురుషానహమ్.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దశైర్యుతం,
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తామ్బూలం
సమర్పయామి.
నీరాజనం
హిరణ్యపాత్రంమధోః
పూర్భం దధాతిమధవ్యోసానీతి ఏకధా |
బ్రహ్మణ్ ఉపహరతి, ఏకధైవయజమాన ఆయుస్తేజో దధాతి
ఓం సామ్రాజ్యం
భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధి పత్యం కర్పూర నీరాజనం దర్సయామి
ఓం నతత్ర సూర్యో
భాతిన చంద్ర తారకం
నేమా విద్యతో భాంతికుతో యమగ్నిః
తమేవ భాంతి మనుభాతి సర్వం |
తస్య భాసా సర్వమిదం విభాతి ||
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవ సర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం
యానికానిచ పాపాని జన్నాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మమ సర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం
సమర్పయామి
(అని మూడుసార్లు
ప్రదక్షిణ చేసి శ్రీ
వరలక్ష్మీ దేవికి నమస్కరించవలయును.)
సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా
మనసా వచసా తథా |
పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం సాష్టాంగవుచ్యతే ||
క్షమాపణం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే
తత్సర్వం క్షమ్యతాందేవి వరలక్ష్మీ నమోస్తుతే.
అనయామయాకృత పూజయా భగవతీ సర్వాత్మికాః శ్రీ వరలక్ష్మీ
దేవీ ప్రీత్యర్ధం సుప్రీతా సుప్ర్సన్నా వరదాభవన్తు.(అని అక్షతలు నీళ్లు వదలవలెను.)
నమస్కారం
నమస్తే త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి
తోరపూజ
తయారుచేసుకున్న
తోరణాన్ని అమ్మవారి వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ,
అక్షతలు వేసి క్రింది విదంగా తోర పూజచేసుకోవాలి.
కమలాయై నమః ప్రథమగ్రంథిం
పూజయామి,
రమాయై నమః ద్వితీయ
గ్రంథిం పూజయామి,
లోకమాత్రే నమః తృతీయ
గ్రంథింపూజయామి,
విశ్వజనన్యై నమః చతుర్థ
గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ
గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ
గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం
పూజయామి,
చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం
పూజయామి,
హరివల్ల భాయై నమః నవమగ్రంథిం
పూజయామి.
తోర
పూజ చేసి,ఈ కింది శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి
దక్షిణేహస్తే నవ సూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వ్రత కథా ప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి
సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని
పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను
.శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు
స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని
ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా
తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు
కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం.
దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.
అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిలో ఎవరు
చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. అప్పుడు శివుడు, కాత్యాయనీ…
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో
రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ
విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన
నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను
సేవలో తరించేంది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి
సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమత ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు
వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని
చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు.వారు
సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ
సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది.
వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు
చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి
తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన
గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన
ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే
సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని,
ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు
ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.
మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి
ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ
దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను
చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి,
సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
మునులారా… శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని
సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం
చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు,
ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి.
అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి.
అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.
వాయన
శ్లోకం
వాయనం
ఇచ్చునప్పుడు క్రింది శ్లోకం చదువుతూ ఇవ్వడం ఎంతో మంచిది.
ఏవం
సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి
* * * * *
No comments:
Post a Comment